అక్రమ గంజాయి రవాణాను అరికట్టండి – మంథని సీఐ కి వినతి పత్రం అందజేసిన బీజేవైఎం నాయకులు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో అక్రమ గంజాయి రవాణా ద్వారా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు మైనారిటీ కూడా నిండని వారు గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును తమ చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని అదే విధంగా డ్రగ్స్ కు బానిసై మానసిక రోగులుగా తయారై అసాంఘిక శక్తులుగా మారి సమాజానికి కీడు చేస్తున్నారని మంథని ప్రాంతంలో గంజాయి వ్యసనపరులు తమ కన్న తల్లిదండ్రులకు సైతం గుదిబండగా మారుతున్నారని వీటి అన్నిటికీ కారణమైన అక్రమ గంజాయి రవాణా దారులపై సమగ్ర విచారణ జరిపి వారి యొక్క జాడలు కనుక్కొని వారిపై ఉక్కు పాదం మోపాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ కు బీజేవైఎం ప్రతినిధి బృందం మెమోరాండం అందజేశారుఅందజేశారు. దీనిపై సిఐ తక్షణమే స్పందించి గంజాయి అక్రమంగా రవాణా చేసేవారిని త్వరలోనే పట్టుకుంటామని గంజాయి సేవించిన వారి పైన కూడా కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మంథని పట్టణ అధ్యక్షుడు బుర్ర రాజు గౌడ్, నాయకులు ఎడ్ల సాగర్, దాసరి శ్రవణ్, గుంటుపల్లి గురువేష్, పార్వతీ ,విష్ణు, విరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు