రాజ్యసభకు వెళ్తున్నా..


` నితీశ్ కుమార్ ప్రకటన
` బీహార్‌తో అనుబంధం కొనసాగుతుందని వెల్లడి
` రాజ్యసభకు నామినేషన్ వేసిన బీహార్ ముఖ్యమంత్రి
` హాజరైన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా
` బీజేపీకి దక్కనున్న కొత్త ముఖ్యమంత్రి పదవి
పాట్నా(జనంసాక్షి):జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ’ఎక్స’ వేదికగా ధవీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు తాను మూడు సభల్లో సభ్యుడిగా ఉన్నానని, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించి ’నాలుగు సభల క్లబ’లో చేరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ’రెండు దశాబ్దాలుగా విÖరు నన్ను నమ్మి ఎంతో మద్దతిచ్చారు. అంకితభావంతో నా నేను విధుల్ని నిర్వర్తించాను. విÖ మద్దతు, నమ్మకం వల్లే బిహార్ అభివద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నా మనసులో ఓ కోరిక ఉంది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలతో పాటు పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నాను. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను. నూతన బాధ్యతలు చేపట్టాక కూడా బిహార్‌తో నా బంధం ఇలాగే కొనసాగుతుందని హావిÖ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తాను’ అని నితీశ్ కుమార ఎక్స్‌లో రాసుకొచ్చారు . నితీశ్ తాజా ప్రకటనతో.. బిహార్‌కు నూతన ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతకే సీఎం పదవీ బాధ్యతలు దక్కవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ ఆశావహులు సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్నారు. ఆ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, రాష్ట్ర మంత్రి దిలీప్ జాయస్‌వాల్, దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. బిహార్‌లో గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. బీజేపీ, జేడీయూ కూటమి తరఫున నితీశ్ కుమార్ రికార్డ్ స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే.. దేశ వ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
రాజ్యసభకు నితీశ్ నామినేషన్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేపర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు నితీశ్ తన ఎక్స్‌లో వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం అమిత్ షా పాట్నాకు వచ్చారు. ఆయనకు సిఎం నితీశ్ స్వాగతం పలికారు. బీహార్‌కు అత్యధిక కాలం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా నితీశ్ రికార్డు క్రియేట్ చేశారు. అయితే రాజ్యసభలో సభ్యుడు కావాలన్న కాంక్ష ఉన్నట్లు ఆయన తెలిపారు. నితిశ్ తన అభిప్రాయాన్ని ఎక్స్‌లో వ్యక్తం చేశారు. బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నట్లు ఆయన చెప్పారు. నితీశ్ తప్ప్పుకోవడంతో.. బీహార్‌కు బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నితీశ్ కుమారుడు నిషాంత్.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టే ఛాన్సు ఉన్నది. రెండు దశాబ్దాల పాటు తనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచారని, దీని ఆధారంగానే బీహార్‌కు సేవ చేశానని, విÖ నమ్మకం, మద్దతుతోనే బీహార్‌ను కొత్త అభివద్ధి కోణం వైపు తీసుకెళ్లినట్లు చెప్పారు. తనపై నమ్మకాన్ని ఉంచి సపోర్టు ఇచ్చినందుకు గతంలో అనేక సార్లు కతజ్ఞలు చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి.. బీహార్ అసెంబ్లీ, మండలితో పాటు.. పార్లమెంట్ ఉభయసభల్లోనూ సభ్యుడిని కావాలన్న కాంక్ష ఉండేదని చెప్పారు. ఆ కోరికతోనే రాజ్యసభ సభ్యుడిని అయ్యే సందర్భం వచ్చిందన్నారు. భవిష్యత్తులో విÖతో ఇదే రకమైన రిలేషన్ కొనసాగుతుందన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బీహార్ సీఎం పోస్టు రేసులో నిత్యానంద్ రాయ్‌తో సమ్రాట్ చౌదరీ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు