అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి
` సుప్రీం లీడర్ మతికి సంతాపం
` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం
` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్
` ఒమన్ విదేశాంగ మంత్రితోనూ మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మతికి భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత్ తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్ రాయబారితో మిస్రీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడిచేసి ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. దాంతో పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్ధరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని మూసివేసింది.ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మతిపై భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. మన దేశం తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్ రాయబారితో మిస్రీ మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో గురువారం మధ్యాహ్నం ఫోన్‌లో సంభాషించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమన్ విదేశాంగ మంత్రితోనూ ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. ఈ మేరకు సోషల్ విÖడియాలో జైశంకర్ పోస్టులు చేశారు.
యుద్ధంతో సమస్యలు పరిష్కరించలేం
` పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలి: మోదీ
` మధ్వవర్తిత్వం చేద్దాం రండి
` ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని ఫోన్
` యుద్ధంపై దౌత్యానికి పిలుపు
న్యూఢిల్లీ(జనంసాక్షి):సైనిక ఘర్షణల ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. భారత్ పర్యటనలో ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో చర్చలు నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల ఈయూతో కుదుర్చుకున్న ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’.. భారత్, ఫిన్లాండ్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. “భారత్, ఫిన్లాండ్‌లకు చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యమార్గాలపై విశ్వాసం ఉంది. కేవలం సైనిక ఘర్షణల ద్వారా సమస్యలను పరిష్కరించలేం. అది ఉక్రెయిన్, లేదా పశ్చిమాసియా.. ఏదైనా కావచ్చు. వివాదాలను వీలైనంత త్వరగా ముగించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇస్తూనే ఉంటాం” అని మోదీ తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఫిన్లాండ్ అధ్యక్షుడితో చర్చల్లో భాగంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. “ఏఐ నుంచి 6జీ వరకు, క్లీన్ ఎనర్జీ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు అనేక హైటెక్ రంగాల్లో పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నాం” అని చెప్పారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు వచ్చారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్
మధ్యప్రాచ్యం సంక్షోభం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. యుద్ధం విషయంలో దౌత్యానికి మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్ చేసి ఖండించారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ఫోన్ చేసి యుద్ధం ముగింపునకు దౌత్యం నిర్వహించాలని కోరారు. ‘ఈ రోజు నా స్నేహితుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియా పరిస్థితి, చర్చలు, దౌత్యానికి సంబంధించి మా ఉమ్మడి ఆందోళనలను చర్చించాం. శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి మేము దగ్గరగా పాల్గొనడం, ప్రయత్నాలను సమన్వయం చేయడం కొనసాగిస్తాం.‘ అని రాసుకొచ్చారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ సంభాషణ జరిగిందని.. ప్రపంచ నాయకులు సంయమనం, దౌత్యపరమైన చర్చలకు మోడీ పిలుపునిచ్చారు. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు చనిపోయారు. అనంతరం ఇరాన్ కూడా ప్రతీకారంగా దాడులకు దిగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

