తగ్గేదేలే అంటున్న ఇరాన్
` అమెరికా ఏయిర్ బేస్‌లపై ముమ్మరదాడులు
` ఇజ్రాయిల్‌కు ధీటుగా జవాబు
` మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఐఆర్‌జీసీ
` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు
` కొత్త సుప్రీం ఎవరొచ్చినా హతమారుస్తామంటున్న ఇజ్రాయెల్
` ఇరాన్ యుద్ధనౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం
` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరిక
` అమెరికా ట్యాంకర్‌పై ఐఆర్‌జీసీ దాడి
` పాలన మార్పునకు ప్రయత్నిస్తే మీ దేశంలో డిమోనా అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటాం
` ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
` అమెరికా దాడుల వేళ.. శ్రీలంక వైపు మరో ఇరాన్ యుద్ధనౌక!
టెహ్రాన్(జనంసాక్షి): ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మతి అనంతరం మధ్య ప్రాచ్య దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేపట్టింది. భారీ ఆయుధాలతో విరుచుకుపడుతూ పశ్చిమాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు ఇరాన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులే కాకుండా యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి 10 దేశాలపై ఇరాన్ ఏకధాటిగా దాడిచేస్తున్న విధానాన్ని చూస్తే ఆ దేశం వద్ద భారీ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయనే సందేహం తలెత్తకమానదు. అయితే.. దశాబ్దాలుగా ఆ దేశం ఎంతో కషిచేసి ఇంత భారీఎత్తున ఆయుధ సామగ్రిని నిర్మించుకుంది. మరి ఆ దేశం ఆయుధగారాన్ని పెంచుకోవడంలో చైనా హస్తం ఉందని అంతర్జాతీయ విÖడియా కథనాల ద్వారా స్పష్టమవుతోంది. ఆ విÖడియా నివేదికల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందే ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వీటిలో ఆయుధాల్లో షాహిద్ క్లాస్ కామికేజ్ డ్రోన్ల నుంచి ఫత్తాహ్ క్లాస్ హైపర్‌సోనిక్ మిసైల్స్ వరకు ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాలపై దాడిచేయగల సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. అయితే.. ఇరాన్ ఈ ఆయుధాలను అభివద్ధి చేసుకోవడంలో చైనా పాత్ర ఎంతమేర ఉందనేదానిపై స్పష్టత లేదు. ఇక.. గత శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు దాడిచేసి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఇరాన్‌కు ప్రమాదకర ఆయుధాలను, అదనపు రక్షణ ఎలా పొందాలో చైనా వివరించిందని మధ్యప్రాచ్యంలోని ఓ విÖడియా సంస్థ నివేదించింది. ఇదిలా ఉండగా.. చైనా తయారుచేసిన సీఎం 302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్`చైనా ఒప్పందం చేసుకోవాలనుకున్నట్టు రాయిటర్స్ తన కథనంలో రాసుకొచ్చింది. ఇక.. ఇరాన్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాలలో ఎక్కువ భాగం ఆ దేశంలోనే ఉత్పత్తి అయినవే అయినప్పటికీ.. వాటిలో చాలావరకు చైనా పాత డిజైన్ల ఉత్పత్తులు లేదా చైనా తయారీ భాగాలపై ఆధారపడి ఇరాన్ రూపొందించుకుని ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే.. కొన్నేళ్లుగా ఇరాన్ ఆయుధగార నిర్మాణంలో చైనా కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం సాయంలేకుండా.. ఇరాన్ ఇంత పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అసాధ్యమని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఇరాన్‌కు1979`1989 కాలంలో తొలిసారి ఆయుధాలు సరఫరా చేసింది చైనా. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల నడుమ 1986లో హై 2, సీ 801 యాంటీ షిప్ వ్యవస్థలను నాడు చైనా సరఫరా చేసింది. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటని స్టాక్‌హోమ్ పీస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించిందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 2005లో ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదనే కారణంగా ఇరాన్‌కు చైనా ఆయుధ సామగ్రి సరఫరాను నిలిపివేసింది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి.
ఇరాన్ యుద్ధనౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం
ఇరాన్‌పై చేస్తున్న పోరులో భాగంగా.. ఆ దేశ యుద్ధనౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. దీనికి తగిన బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇరాన్‌కు 2000 మైళ్ల దూరంలో సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడిందని అరాగ్చీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ నౌక భారతదేశానికి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. అక్కడినుంచి తిరిగివెళ్తుండగా అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దేనాపై దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనికి అగ్రరాజ్యం తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన సమయం త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. ఐరిస్ దేనా`75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. శ్రీలంక భద్రతా దళాలు కొందరిని రక్షించగా, 87 మతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుళ్లు వినిపించాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ స్థావరంపై దాడి జరిగినట్లు విÖడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇది అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధికి సవిÖపంలో ఉంటుంది. పేలుళ్ల కారణంగా జరిగిన నష్టం గురించి ఇంకా తెలియరాలేదు.
అమెరికా ట్యాంకర్‌పై ఐఆర్‌జీసీ దాడి
పశ్చిమాసియాలో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి, ముంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు విÖడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఇరాన్ విÖడియా ప్రకారం.. పర్షియన్ గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు వెల్లడించింది. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. తమ యుద్ధనౌకపై దాడికి ప్రతిస్పందనగానే దాడి జరిగిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అటు అమెరికా కూడా దీనిపై ఇంకా స్పందించలేదు.భారత్‌లోని విశాఖపట్నం నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తున్న ఐరిస్ దేనా`75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 87 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందిని శ్రీలంక దళాలు రక్షించాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ క్రమంలో యూఎస్ ట్యాంకర్‌పై దాడి జరగడం గమనార్హం.
పాలన మార్పునకు ప్రయత్నిస్తే మీ దేశంలో డిమోనా అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటాం: ఇరాన్
పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నాలు చేస్తే.. ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. తమ లక్ష్యాలను చేరుకున్నామని ప్రకటిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపేయవచ్చంటూ వార్తలు రావడంపై ఇజ్రాయెల్ అధికారి స్పందించారు. ఇరాన్‌లో పాలకులు మారేవరకు అమెరికా యుద్ధం కొనసాగిస్తుందని జెరూసలెం పోస్టుతో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఇరాన్ ఇజ్రాయెల్‌లోని అణు ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంటామంటూ తాజాగా హెచ్చరికలు చేసినట్లు టెహ్రాన్ సైనికాధికారిని ఉటంకిస్తూ ఆ దేశ విÖడియా పేర్కొంది. పశ్చిమాసియాలో చమురు మౌలిక సదుపాయాలను తమ క్షిపణులు లక్ష్యంగా చేసుకుంటాయని ఆయన బెదిరించారు.
అమెరికా దాడుల వేళ.. శ్రీలంక వైపు మరో ఇరాన్ యుద్ధనౌక!
ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి కొన్ని గంటలు కావస్తుండగా.. మరో ఇరాన్ నౌక శ్రీలంక దిశగా వెళ్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా వెల్లడించారు. తమ దేశ ప్రాదేశిక జలాల దగ్గరలో ఆ నౌక ఉందని, అందులో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.ఈ నౌకపైనా అమెరికా దాడిచేయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో దాదాపు 100 మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు అంతర్జాతీయ విÖడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ నౌక అత్యవసర పోర్ట్ కాల్ కోసం ప్రభుత్వ అనుమతి కోరిందని, క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్సా వెల్లడించారు.



