సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ) శుక్రవారం ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను కమాన్ పూర్ బ్రాంచ్ మేనేజర్ నర్సింగ్ రాజు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆదివరాహ మండల సమైక్య తరపున బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ బంగారు శిరీష ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) ను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మేనేజర్ తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నగదు జమ, నగదు ఉపసంహరణ, ఆధార్ ఆధారిత లావాదేవీలు, ఖాతా సేవలు, తదితర బ్యాంకింగ్ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శివారెడ్డి, ఏపీఎం పద్మ, సిద్దిపల్లె గ్రామ సర్పంచ్ బంగారు కళ్యాణి మహేష్, మాజీ సర్పంచ్ తాటికొండ శంకర్, సీసీలు బిక్షపతి, మల్లేశం, ఎమ్మెస్ ఓబీ లు అధ్యక్షురాలు శిరీష, కార్యదర్శి పద్మ, కోశాధికారి రూప, బ్యాంకు సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


