అక్రమ సంబంధానికి రక్షణ కోసం హైకోర్టుకెక్కిన జంట


ఆమెకు పెళ్లయ్యింది.. భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య భర్త నుంచి దూరమైంది. అయితే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడిరది.. ఆమె వయసు ముప్పై కాగా.. అతడి వయసు 27 ఏళ్లు.. భర్తకు దూరమైన ఆమెతో ఆ కుర్రాడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆమె భర్త కుటుంబీకులు దీనిపై అభ్యంతరం తెలిపారు. బెదిరించారు. అయితే ఈ అక్రమ వ్యవహారం సాగిస్తున్న జంట మాత్రం తమకు రక్షణ కల్పించాలని ఏకంగా హైకోర్టుకు ఎక్కడ చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌ హైకోర్టులో ఈ పిటీషన్‌ విచారణ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోకుండా తాము సహజీవనం చేస్తున్నామని.. వారి బంధువులు బెదిరిస్తున్నారని.. రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఈ జంట దాఖలు చేసిన పిటీషన్‌ ను కోర్టు కొట్టి వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ సంబంధం తరహా సహజీవనానికి తాము రక్షణ కల్పించలేమంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వమని జంటకు షాక్‌ ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలుఇస్తే తప్పుడు సందేశాన్ని పంపినట్టు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇదివరకూ సహజీవనంలో ఉన్న జంటలు తమ రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. వారికి కోర్టులు అండగా నిలిచాయి. పెళ్లితో సంబంధం లేకుండా సహజీవనం చేస్తున్న వారికి రక్షణగా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. అయితే రాజస్తాన్‌ జంటది మాత్రం ఆమె ఇప్పటికే పెళ్లైన వివాహిత.. పెళ్లికాని యువకుడు. విడాకులు కాలేదు. అందుకే రక్షణ కల్పించలేమని కోర్టు తీర్పునిచ్చింది. చట్టపరంగా భర్త నుంచి విడాకులు తీసుకొని యువకుడితో సహజీవనం పెళ్లి చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేసినట్టైంది. విడాకులు తీసుకోకుండా సహజీవనం చేస్తుండడంతో కోర్టు ఆమెకు రక్షణ కల్పించలేమని తీర్పునిచ్చింది. అయితే వారి సహజీవనానికి మాత్రం కోర్టు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. వారిపై దాడి చేసే హక్కు.. బెదిరించే హక్కు ఎవరికి లేదని కోర్టు స్పష్టం చేసింది.