పట్లూర్ ఎస్బిఐ బ్యాంక్ ఎదుట ఎగరని జాతీయ జెండా

 

 

 

 

 

 

 

 

మర్పల్లి జనవరి 27 (జనం సాక్షి) పట్లూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దేశ గౌరవాన్ని చాటే ముఖ్యమైన జాతీయ పండుగ రోజున కూడా బ్యాంకు అధికారులు కనీస బాధ్యతను నిర్వర్తించకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎస్ బీ ఐ బ్యాంకు ప్రతి జాతీయ పండుగను గౌరవంతో నిర్వహించాల్సిన బాధ్యత కలిగి ఉండగా, అధికారులు చూపిన ఈ నిర్లక్ష్యం దేశభక్తి భావాలకు విరుద్ధంగా ఉందని పలువురు పేర్కొన్నారు. పట్లూర్ గ్రామంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నప్పటికీ, బ్యాంకులో మాత్రం జాతీయ జెండా కనిపించలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.