ఘనంగా గణతంత్ర వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు
` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన
` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు
` ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్‌డెర్ లేయెన్
న్యూఢిల్లీ(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్‌లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివద్ధి ప్రస్థానం, సాంస్కతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది విచ్చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పరేడ్ భారత సైనిక శక్తి పాటవాన్ని సగర్వంగా చాటిచెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో వాడిన పలు ఆయుధ వ్యవస్థలను సైనిక దళాలు కర్తవ్యపథ్ వేదికగా అచ్చెరువొందేలా ప్రదర్శించాయి. ఈ కవాతులో తొలిసారిగా బ్యాటిల్ అరే ఫార్మేషన్‌లో నిర్వహించిన కవాతు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యుద్ధ క్షేత్రంలో సైన్యాల మోహరింపును పోలినట్టు పరేడ్ నిర్వహించడం అతిథులు ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పరేడ్‌లో త్రివిధ దళాలకు చెందిన 6,050 సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో సాగిన ఆయుధ ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని జగద్విదితం చేసింది. ఈ వేడుకల సందర్భంగా నాలుగు ఎమఐ`17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన, 300 కిలోవిÖటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్ అతిథులను ఆకట్టుకున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు ప్రదర్శన కూడా ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది. భారత్‌కు అత్యంత కీలకంగా మారిన ఎస్`400 క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ప్రదర్శించారు. అపాచీ, ప్రచండ్ హెలికాప్టర్లు, వివిధ యుద్ధ విమానాల గగనతల విన్యాసాలు మెప్పించాయి. డ్రోన్ ప్రదర్శన కూడా పరేడ్‌లో జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కవాతులో కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైనిక కవాతుతో పాటు రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, కళా ప్రదర్శనలు దేశ సాంస్కతిక వైవిధ్యతను చాటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 శకటాలు దేశ ఖ్యాతిని ఇనుడింపచేశాయి. ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అతిథులు పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.
గగనతలంలో ‘సిందూర’.. వాయుసేన విన్యాసాలు
గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత వాయుసేన గగనతలంలో అద్భుత రీతిలో విన్యాసాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోలను ‘ఎక్స’ వేదికగా పోస్ట్ చేసింది. గత ఏడాది ‘ఆపరేషన్ సిందూర’ సమయంలో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై చేపట్టిన దాడుల దశ్యాలనూ ఓ వీడియోలో పొందుపర్చింది. ‘నూర్ ఖాన్ బేస్‌పై దాడి జరిగింది’, ‘క్షిపణి తాకింది’ అనే మాటలు అందులో వినిపిస్తున్నాయి.“గణతంత్ర వేడుకల సందర్భంగా ఆర్మీ, నౌకాదళాల సమన్వయంతో విన్యాసాలు నిర్వహించాం. కచ్చితమైన, సమయానుకూల కార్యకలాపాల ద్వారా.. సానుకూల సైనిక ఫలితాలను సాధించడంలో మా పాత్రను ఇవి చాటిచెప్పాయి” అని వాయుసేన ట్వీట్ చేసింది. ‘ఆపరేషన్ సిందూర’లో ఎయిర్‌ఫోర్స్ పోషించిన పాత్రకు గుర్తుగా నిర్వహించిన ప్రత్యేక విన్యాసంలో రెండు రఫేల్‌లు, రెండు మిగ్`29లు, రెండు సుఖోయ్`30 ఎంకేఐలు, ఓ జాగ్వర్ యుద్ధవిమానం భాగమయ్యాయి. 16 యుద్ధవిమానాలు, నాలుగు సరకు రవాణా విమానాలు, తొమ్మిది హెలికాప్టర్లు కలిపి మొత్తం 29 ఎయిర్‌క్రాఫ్ట్‌లు వాయుసేన విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతలంలో అర్జన్, వజ్రాంగ్, వరుణ, విజయ్ తదితర ఆకతులను ఏర్పరచాయి. ధ్రువ్ హెలికాప్టర్ ‘సిందూర’ జెండాతో కనిపించింది.

ప్రజలకు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
ముర్ము, మోడీల సందేశం
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ విÖడియా మాధ్యమం ఎక్స్‌లో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ’విÖ అందరికీ నా హదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విÖ జీవితం.. ఆనందం, శాంతి, భద్రత, సామరస్యంతో నిండి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ విÖడియా మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశం పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికసిత్ భారత్‌ను నిర్మించాలనే మన సమష్టి సంకల్పంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందించాలని ఆకాంక్షించారు మోదీ. గణతంత్ర దినోత్సవం మన స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు శక్తిమంతమైన చిహ్నమని ప్రధాని తెలిపారు. ఈ పండుగ దేశాన్ని కలిసి నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగడానికి మనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇస్తుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశవాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. భారతదేశ గర్వం, కీర్తికి ప్రతీక అయిన ఈ జాతీయ పండుగ.. విÖ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలి. అభివద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పం మరింత బలపడాలి’ అని ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని మోదీ అన్నారు. ఆమె ప్రసంగం ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువలను రక్షించడానికి, ఇంకా అభివద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి వారి నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రేరేపిస్తుందన్నారు.

భారత్‌కు ప్రపంచదేశాల శుభాకాంక్షలు
` చైనా, రష్యా, అమెరికా తదితర దేశాల సందేశాలు
న్యూఢిల్లీ(జనంసాక్షి): భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్టేలియా, భూటాన్ మొదలైన దేశాల నుంచి సందేశాలు అందాయి. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఈసందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు. ’భారత్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చైనా, భారత్ ఎప్పటికీ మంచి పొరుగువారిగా,స్నేహితులుగా ఉంటాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సందేశమిª`చారు. భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశం యూఎస్‌ల మధ్య చరిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. రక్షణ, ఇంధనం వంటి అభివద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ అమెరికాల మధ్య సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. భారత ప్రజలకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాలలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో భారత్‌లో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో విలువైన జ్ఞాపకం. భారత్, ఫ్రాన్స్‌ల బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరిలో కలుద్దాం అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సందేశం వెలువరించారు. భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. భారత్`ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. ఐరోపా యూనియన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.

 

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు
శుభాంశు శుక్లాకు అశోకచక్ర ప్రదానం
న్యూఢిల్లీ(జనంసాక్షి):అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడుగుపెట్టిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో కెప్టెన్ శుభాన్షు శుక్లాకు ఆమె ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు యాక్సియమ్`4 మిషన్ చేపట్టిన సమయంలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అసాధారణ ధైర్యంతో పాటు ఆయన సంకల్పానికి గౌరవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2025 జూన్‌లో ’యాక్సియమ్`4’ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు. ఖగోళంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం, మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే అంశాలపై ఆయన వీడియో చిత్రీకరించారు. అలాగే అంతరిక్షంలో మానవ వ్యోమగాముల పరిస్థితిపై సైతం ఆయన అధ్యయనం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎసఎస్)ను సందర్శించిన తొలి భారతీయుడిగావ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రికార్డుకెక్కారు. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ’కీర్తి చక్ర’ను అందజేశారు.