ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగిరిన మువ్వన్నెల జెండాలు

 

 

 

 

జాతీయ జెండాలను ఆవిష్కరించిన అధికారులు..

చెన్నారావుపేట, జనవరి 26 ( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో మహమ్మద్ ఆబిద్ అలీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకట సాయి శివానంద్, పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ లక్ష్మణమూర్తి, కస్తూర్బా పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సరోజ, ఇందిరా క్రాంతి పతం కార్యాలయం ఆవరణలో ఏపీఎం తిలక్ కుమార్ గౌడ్, ఎస్ బిఐ బ్యాంకు ఆవరణలో మేనేజర్ మోహన్ కాంత్, విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ ఏఈ సంపత్, అమీనాబాద్ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ జ్యోతి, చెన్నారావుపేట సొసైటీలో సీఈఓ చిట్టె రవి, అమీనాబాద్ సొసైటీలో సీఈఓ పులి రమేష్, సీనియర్ సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాండ్ల కృష్ణమూర్తి, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మంద నరేష్, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు.