అన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పిట్లం జనవరి 23 (జనం సాక్షి)పిట్లం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. నేత్ర వైద్య నిపుణులు భరత్ గారు పరీక్షించి కంటి సమస్యలు ఉన్న 10 మందికి బోధన్ కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది. మరికొందరికి కంటి సమస్యలు పరీక్షించి అద్దాలను రాసియడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నారాయణ గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి రూప దస్తా గౌడ్ లయన్స్ కార్యదర్శి బాలు డిస్ట్రిక్ చైర్మన్ కిషన్, లక్ష్మీనారాయణ మరియు గ్రామ కార్యదర్శి శేఖర్, రవి, మైబూబ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు



