కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

 

 

 

 

 

 

 

 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జనం సాక్షి 25రాయికల్:రాయికల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ రాయికల్, మున్సిపల్ పరిధిలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్ములన సంస్థ, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణి కార్యక్రమం నిర్వహించి 42 మహిళా సంఘాలకు 11,29,571 రూపాయల జంబో చెక్కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి చెక్కు అందజేశారు. అలాగే సెంట్రల్ లైటింగ్ సిస్టం డ్రైనేజీ వ్యవస్థ రీలింగ్ వాల్ పార్క్ మరియు ఓపెన్ జిమ్ వంటి 7.20 కోట్ల కోట్ల అంచనా తో ఐదు రకాల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
జగిత్యాల నియోజకవర్గ రాయికల్ మున్సిపల్ పరిధిలో మా మహిళా సోదరీమణులు, మా చెల్లెల్లు, మా అక్కలు, మా తల్లులు సుమారు 11,29,571 రూపాయల వడ్డీ రాయితీ మా మహిళా సంఘ సోదరీమణులకు మేలు జరిగే కార్యక్రమం రాయికల్ మున్సిపల్ కు సంబంధించిన సుమారు 7 కోట్ల 20 లక్షల విలువగల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
మహిళా సోదరీమణుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులను
ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను ఆర్థికంగా, వ్యాపార పరంగా మరియు అన్నిరకాలుగా ముందంజలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఈరోజు అమలు చేస్తున్న సందర్బంగా మొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకం ఉచిత బస్సు మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించిన ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య,వైద్యం మరియు మహిళాభివృద్ధికి ఇస్తుంది.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుంది.
ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ,సన్న బియ్యం , మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల ఉచిత కరెంట్ ,సోలార్ పవర్ ప్లాంట్ లు ,పెట్రోల్ బంక్ , మహిళలకు వడ్డీ లేని ఋణాలు,అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తుంది . మహిళలకు కు నైపుణ్య శిక్షణ ,సమావేశ నిర్వహణ కోసం, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభం కాబోతున్నదని అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ
రాయికల్ పట్టణ మహిళా సంఘాలకు 11,29,571 రూపాయల వడ్డీలేని రుణాలు పంపిణీ అదేవిధంగా రాయికల్ మున్సిపల్ కు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలియజేస్తూ ఈరోజు 7.20 లక్షల రూపాయల పలు అభివృద్ధి పనుల కొరకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గా గెలిచిన నుండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో
గత ప్రభుత్వం లోని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వంలో నూతన పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగస్వాముడిని అవుతానని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
రాయికల్ పట్టణ మహిళా సంఘాలకు 11,29,571 రూపాయల వడ్డీలేని రుణాలు పంపిణీ అదేవిధంగా రాయికల్ మున్సిపల్ కు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు కూడా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అందువలన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇదే ఉత్సాహంతో మహిళా సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వృద్ధి చేందాలని కోరారు. మున్సిపల్ అభివృద్ధి కి నిధులు మంజూరు చేసినందుకు వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. వడ్డీ లేని రుణాలు అందించినందుకు మహిళలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధి కి తోడ్పడుతున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో, మహిళా సంఘం సభ్యులు, వివిధ స్థాయి ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.