బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత కోటి నితిన్ ప్రతిభ

బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీల్లో బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన పాత కోటి నితిన్ కు 5వ ర్యాంకు రావడం కొన్నే గ్రామానికి చాలా గర్వకారణమని గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ కొనియాడారు. ముందు నుండి నితిన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో నైపుణ్యత ఉందని గుర్తించి వారి తండ్రిగారు పాత కోటి మల్లేశం గుర్తించడం మంచి పరిణామం అని వారన్నారు. కొన్నే గ్రామానికి పేరు తెచ్చినందుకు నితిన్ ను గ్రామ సర్పంచ్ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు



