అటవీ భూముల చుట్టూ హద్దులు
నిజామాబాద్,అక్టోబర్27( జనం సాక్షి); రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి అటవీ విస్తీర్ణం చుట్టు హద్దులు ఏర్పాటుచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఉపాధి హావిూ పథకం ద్వారా అటవీ విస్తీర్ణం చుట్టు కందకాలు తవ్వించాలని సూచించారు. మండల పర్యవేక్షణ అధికారులు 100 శాతం వ్యాక్సినేషన్ అయ్యేవిధంగా చూడాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ఐసోలేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని తెలిపారు.