అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…..
*ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు….
***వారోత్సవాల సందర్భంగా మండలంలో విస్తృత తనిఖీలు…..
***ఎస్సై చల్లా రాజు….
టేకుమట్ల.సెప్టెంబర్25(జనం సాక్షి) ప్రభుత్వ నిషేధిత అసాంఘిక శక్తులైన మావోయిస్టులకు టేకుమట్ల మండల గ్రామాలలోని ప్రజలెవరూ సహకరించొద్దని టేకుమట్ల ఎస్సై చల్లా రాజు అన్నారు.శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై చల్లా రాజు మాట్లాడుతూ ఈనెల 21 నుండి 27వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎవరు మావోయిస్టులకు సహకరించద్దని మావోయిస్టు పార్టీకి గతంలో ఆకర్షితులై సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా మావోయిస్టు పార్టీకి సహకరిస్తే కఠినమైన చర్యలు పాల్పడతామని, అలాంటి వ్యక్తులకు చట్టం పరిధిలో శిక్ష తప్పదని ఎస్సై చల్లా రాజు హెచ్చరించారు.అదేవిధంగా టేకుమట్ల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహించి,సరైన వాహనాల పత్రాలు లేని వ్యక్తులకు జరిమాణాలు విధించి,అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించి వదిలివేసినట్లు ఆయన తెలిపారు.మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల కు పారితోషికం ఇస్తూ వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్సై చల్లా రాజు అన్నారు.
Attachments area