అబద్దాలతో ప్రజలను నమ్మించలేరు


ఎవరి ఆస్తులు ఎంతో విచారణ చేయండి: ఈటెల
కరీంనగర్‌,అగస్టు12(జనం సాక్షి): ఆర్థికమంత్రి హరీష్‌రావు నిన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అబద్దాలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అవి మోసపు మాటలని హుజూరాబాద్‌ ప్రజలకు తెలుసునని అన్నారు. హరీష్‌రావు తనపై చాలా విమర్శలు చేశారని, అయితే తాను ఇక్కడ ప్రజల ప్రేమను పొంది అప్రతిహాసంగా గెలుస్తున్న వ్యక్తినని చెప్పారు. తన ఆస్తులపై విచారణ జరపాలని అలాగే విూ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని, ఎవరు సంపాదన ఏంతో తేలిపోతుందన్నారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్దాంతపరమైన విమర్ళలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్‌ అన్నారు.