అరసవల్లికి రెగ్యులర్‌ ఈవో

సహాయ కమిషనర్‌గా వెంకటేశ్వరరావు నియామకం
శ్రీకాకుళం, జూలై 31 : అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానం సహాయ కమిషనర్‌గా ఎం.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గోదావరి జిల్లాకు చెందిన ఈయనను శాఖాపరమైన బదిలీల్లో భాగంగా అరసవల్లి దేవస్థానం ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన ఎన్‌.ముత్యాలరావు పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్‌గా బాసరకు బదిలీ అయ్యారు. దాంతో శ్రీకూర్మం దేవస్థానం ఈవో ప్రసాద్‌పట్నాయక్‌ను 9 నెలల క్రితం అరసవల్లి ఇన్‌చార్జి ఈవోగా ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు రెగ్యులర్‌ ఈవోగా వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.