ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం

చెన్నారావుపేట, జనవరి 13 ( జనం సాక్షి): ఎంపీడీవోగా పదోన్నతి పొంది చెన్నారావుపేట నుండి ఖమ్మంకు వెళ్తున్న ఎంపీఓ శ్రీధర్ రాజును ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానం చేపట్టారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో వెంకట సాయి శివానంద్, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు గొడిశాల వికాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాదావత్ నిట్టు, కోశాధికారి కత్తెరపెల్లి రాజు, గౌరవ అధ్యక్షులు తిప్పని చేరాలు, శ్యామ్, అవినాష్, మహేష్, నరసింహారాములు, రమేష్, ప్రమీల, మమత, శ్రీనాథ్, సీనియర్ అసిస్టెంట్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



