ఆగివున్న లారీని ఢీకొన్న కారు
ఒకరు అక్కడిక్కడే మృతి
కామారెడ్డి,ఆగస్ట్17(జనంసాక్షి): జిల్లాలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్ ఆఫీస్ గోదాం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా…మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.