“ఆధారం” కోసం జిల్లాలను దాటివచ్చి

 

మంత్రి కేటీఆర్ కలిసేందుకు ఎదురు చూపు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 27. (జనంసాక్షి).

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కనిపించి తమ వైపు చూస్తే చాలు ఏదైనా సహయమంది ఎదైన “ఆధారం” దొరుకుతుందని రాష్ట్రంలో అనేక మంది బాధితులు భావిస్తుంటారు. మంగళవారం అలా భావించి జిల్లాలను దాటి సిరిసిల్లకు ఆశతో ఇద్దరు పసిబిడ్డలతో మంత్రిని కలిసేందుకు సిరిసిల్ల బైపాస్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద కు వచ్చింది ఓ బాధితురాలు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామం చెందిన సందు పట్ల మౌనిక భర్త వెంకటేష్ భవన నిర్మాణ కార్మికుడు గా పని చేస్తూ ఇటీవల కరెంట్ షాక్ తో చనిపోవడంతో మౌనిక ఇద్దరు పసిబిడ్డలతో నిస్సహాయ స్థితిలో మిగిలింది. చిన్న వయసులోని పెద్ద కష్టాలను మోస్తూ బతుకుతెరువుకు ఆధారం లేక తల్లడిల్లుతుంది. ఈ క్రమంలో పసిబిడ్డలను తీసుకొని సిరిసిల్లకు వచ్చి మంత్రి కేటీఆర్ కలిస్తే ఏదైనా ఆధారం చూపిస్తాడని ఆశతో మంత్రి రాక కోసం చూస్తూ నిలబడింది. జనం సాక్షి ప్రత్యేకంగా కదిలిస్తే వివరాలు తెలిపింది.