‘ఆర్ఆర్ఆర్’ని జ్యూరీకి పంపకపోవడం

ఆశ్చర్యానికి గురి చేసింది : దర్శకులు ఎన్. శంకర్

 

”ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ చేసిందని విన్న తర్వాత ‘ఛల్లో షో’ టీజర్ చూడటం జరిగింది. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్ లో చాలా వచ్చాయి. నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్ గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పని చేశాను. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పని చేసిన అనుభవంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘ఆర్ఆర్ఆర్’లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి చిత్ర బృందం చేసిన కృషి మనందరికీ తెలిసిందే. గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో’ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని పంపకపోవడం బాధకలిగించింది” అన్నారు దర్శకులు ఎన్ శంకర్.