ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి):
ఆర్టీసిఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమైక్య అధ్యక్షులు కే. రాజిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎం.విచారి మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికలో భాగంగా ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.లేనియెడల మాఆర్టీసీ కుటుంబాల ఓట్లే గెలుపు మరియు ఓటమిలకు నాంది పలుకుతామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో పంది యాదయ్య,మాధగోని అంజయ్యగౌడ్,బాలస్వామిశంకర్,తదితర ఆర్టీసీకార్మిక నాయకులు పాల్గొన్నారు.