ఆసరా తో భరోసా…..
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి…..
టేకుమట్ల.ఆగస్టు30(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అయినా ఆసరాతో అందరికీ భరోసా కలుగుతుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం టేకుమట్ల మండలంలోని రాఘవపూర్, గర్మిళ్లపల్లి,వెలిశాల,పంగిడిపల్లి గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు.అనంతరం శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని,భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఆసరా పింఛన్లు 2000 నుండి 3000 వరకు ఇచ్చిన దాఖలాలు లేవని అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే సాధ్యమైందని,టేకుమట్ల మండలానికి గతంలో 3500 ఆసరా పింఛన్లు ఉండగా ప్రస్తుతం నూతనంగా 1132 ఆసరా పింఛన్లు మంజూరు అయ్యాయని,తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతుబంధు,రైతు బీమా, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా,వృద్ధులు,వికలాంగులు,వితంతువుల కోసం ఆసరా పింఛన్లు,గర్భిణీ స్త్రీల కోసం 102 వాహనం,దళితులు అభివృద్ధి కోసం దళిత బంధు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవంసమయంలో పాప పుడితే 13000,బాబు పుడితే పన్నెండు వేల రూపాయలు, కెసిఆర్ కిట్టు లాంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ సత్యపు మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రజలందరూ ఎల్లవేళలా కృతజ్ఞులై ఉండాలని భూపాలపల్లి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,వైస్ ఎంపీపీ పోతనవేణి ఐలయ్య, ఎంపీడీవో అనిత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల రవి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గుణిగంటి మహేందర్ గౌడ్,రాఘవపూర్ సర్పంచ్ నందికొండ శోభారాణి మహిపాల్ రెడ్డి,గర్మిళ్లపల్లి సర్పంచ్ నల్లబెల్లి రమ రవీందర్,వెలిశాల సర్పంచ్ చింతలపల్లి విజయ స్వామి రావు,పంగిడిపల్లి సర్పంచ్ కాసర్ల ప్రియాంక మహాజన్ అరవింద రెడ్డి, ఎంపీటీసీ ఏనుగు తిరుమల లచ్చిరెడ్డి, ఎంపీటీసీగంధం వజ్ర సారయ్య, సర్పంచులు మహేష్,పండుగ శ్రీనివాస్, నేరెళ్ల శ్రీనివాస్, చదువు మధురం మహేందర్ రెడ్డి,అడగాని లత రామారావు, గజ్జి సుజాత రమేష్,పొలాల సర్వోత్తమ్ రెడ్డి,ఎంపీటీసీ ఆది సునీత రఘు,పెరుమాళ్ళ చంద్రకళ మొగిలి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు