ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.