ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి

ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి                                                    హుజూర్ నగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని  ప్రియదర్శిని జూనియర్, డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం  జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1969 సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ స్థాపించడం జరిగింది,  విద్యార్థులు విద్యతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన ఉన్నప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా పచ్చదనం పరిశుభ్రత, గ్రామాల దత్తత ద్వారా గ్రామాల్లో సామాజిక సమస్యల గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మట్టపల్లి రవీందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జక్కుల రమేష్, నాగేశ్వరరావు, అధ్యాపకులు కనకాంబరం, సత్యనారాయణ, రజనీకాంత్, శీను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Attachments area