ఎన్గల్‌లో రైతు చైతన్య యాత్ర

చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. స్థానిక గ్రామ పంచా యతీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వ హించారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసే పంటలు, వ్యవసాయ సస్యరక్షణ, మెళ వకులు, జాగ్రత్తలు తదితర అంశాలపై రైతు లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయాధికారి కె సంధ్యరాణి, పశువైధ్యాదికారి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి, ఎఇఓ మాధవి,మాజీ సర్పంచ్‌ ఎనగంటి శంరనఖ, మాజీ ఎంపిటిసి ల్యాండే సుమతి సుధాకర్‌, మాజీ ఉప సర్పంచ్‌ గసికంటి ప్రభాకర్‌,ఆదర్శరైతు, రైతులు పాల్గోన్నారు.