ఎస్‌ఎస్‌సిలో వాగీశ్వరి విద్యార్థుల ప్రతిభ

గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్‌ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్‌ రేగులపాటి రవిచంద్రరావు పేర్కొన్నారు. తమ పాఠశాలకు చెందిన లైశెట్టి నిఖిల్‌, నాయిని ప్రశాంత్‌లకు ఏ1 గ్రేడు సాధించగా, నక్క శ్వేత ఏ-2 గ్రేడు సాధించారని అన్నారు. అలాగే పాఠశాలకు సంబంధించి 100% ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. కాగా విద్యార్థినీ, విద్యార్థులు సాధించిన ఈ ఉత్తీర్ణతకు సహకరించిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యా యులకు ఆయన అభినందనలు తెలిపారు.