ఏటీపీ వరల్డ్ టూర్ సెమీస్‌లో జొకోవిచ్, ముర్రే
ల్శడఐ్, న|్శబ్ 10 : వరల్డ్ నెంబర్ వన్ నోవక్ జొకోవిచ్ సీజన్‌ను విజయంతో ముగించేందుకు మరో రెండడుగుల దూరంలో నిలిచాడు. ఏటీపీ వరల్ట్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సెవిూస్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో జొకోవిచ్ 6-2 , 7-6 తేడాతో ఐదో సీడ్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ థామస్ బెర్డిచ్‌పై విజయం సాధించాడు. ఇప్పటికే ముర్రే , సోంగాలపై విక్టరీ కొట్టిన సెర్బియన్ స్టార్ చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచాడు. అయితే రెండో సెట్‌లో బెర్డిచ్ పోరాడడంతో విజయం కోసం టై బ్రేక్ వరకూ ఆడాల్సి వచ్చింది. టై బ్రేక్‌లో జొకోవిచ్ 8-6 తేడాతో నెగ్గాడు. దీంతో ఈ ఏడాది జొకోవిచ్ ఖాతాలో 73 విజయం చేరింది. తద్వారా డేనిడ్ ఫెర్రర్ సాధించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ రికార్డును సమం చేశాడు. మరో మ్యాచ్‌లో బ్రిటన్ సంచలనం ఆండీ ముర్రే 6-2 , 7-6 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు సోంగాపై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ఏకపక్షంగా సాగింది. ముర్రే సునాయాసంగా ఆధిక్యం సాధించాడు. అయితే రెండో సెట్‌లో మాత్రం సోంగా నుండి పోటీ ఎదురవడంతో టై బ్రేక్ తప్పలేదు. టై బ్రేక్‌లో ముర్రే పై చేయి సాధించి సెవిూస్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ప్రస్తుతం గ్రూప్ ఎ నుండి జొకోవిచ్ మూడు విజయాలతో టాప్ ప్లేస్‌లో నిలివగా… ముర్రే రెండు విజయాలు , ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచాడు.