ఐదోసారి చెస్‌ విశ్వవిజేతగా విశ్వనాథ్‌ ఆనంద్‌

ఐదోసారి చెస్‌ విశ్వవిజేతగా విశ్వనాథ్‌ ఆనంద్‌
మాస్కో : ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా భారత్‌కు చెందిన  నిలిచారు. ఆనంద్‌ విశ్వవిజేతగా నిలవడం ఇది ఐదోసారి. అంతకు ముందు ఆయన 2000, 2007, 2008 సంవత్సరాల్లో  ప్రపంచ చాంపియన్‌ టైటిల్స్‌ గెల్చుకున్నారు. మాస్కోలో జరుగుతున్న 2012 ప్రపంచ చెస్‌ చాంపియన్‌ షిప్‌లో ఆనంద్‌ విశ్వవిజేతగా గెలుపొందాడు. టై బ్రేకర్‌లో  ప్రత్యర్థి గెల్ఫాండ్స్‌పై 5-1.5 తేడాతో ఆనంద్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయన 8.50 కోట్ల రూపాయల నగరు బహుమతి పొందారు. ఆనంద్‌ ప్రస్తుత రేటింగ్‌  2971గా ఉంది. అత్యధిక ఫిడె రేటింగ్‌ ఉన్న ఆటగాళ్లలో ఆనంద్‌ నాలుగోవాడు.