హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలి ` సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (%Rవఙaఅ్‌ష్ట్ర Rవససవ%)హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని సీఎం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో యాదవులది అత్యంత కీలకమైన పాత్ర అన్నారు. వారికి మరిన్ని అవకాశాల కోసం పార్టీ పెద్దల దృష్టికి తెస్తామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.