ఒలింపిక్స్‌లో సెమిస్‌లోకి హైదరాబాదీ సైనా

లండన్‌ ఆగస్టు 2 : భారత ఏష్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ పతకానికి చేరువ అవుతోంది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా బ్యాడ్మింటన్‌ మహిళా సింగిల్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా ఆమె రికార్డు సృష్టించింది. సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టిన తొలి మహిళా బ్యాడ్మింటన్‌ క్రీడాకారణిగా ఆమె గురువారం చరిత్ర సృష్టించింది. డెన్మార్క్‌కు చెందిన టినే బాన్‌ను 21-15, 22-20 స్కోరుతో క్వార్టర్‌ ఫైనల్లో సైనా మట్టి కరిపించింది. సెమీ ఫైనల్లో సైనా శుక్రవారం చైనాకు చెందిన ప్రపంచ నెం బర్‌ వన్‌ యిహాన్‌ వాంగ్‌తో తలపడుతుంది.
సైనా జరిగిన ఫ్రీ క్వార్టర్స్‌ పోరులో ఐదోసీడ్‌ సైనా 21-14, 21-16తో 20వ ర్యాంకర్‌ జీ యావో (నెదర్లాండ్స్‌)ను వరుస గేముల్లో ఓడించి, క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 38 నిమి షాల్లోనే ముగిసిన ఈ పోరులో సైనా సత్తాకు యావో నిలవలేకోపోయింది. సైనా విషయానికి వస్తే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మహిళల సిం గిల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న ప్పటికీ మళ్లీ లండన్‌ ఒలింపిక్స్‌లో రెండోసారి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి అర్హత సాధించడం ద్వారా సైనా కూడా రికార్డు సృష్టించింది. 22 సంవ త్సరాల వయసు గల సైనా బీజింగ్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ నుంచి వెనుదిరిగింది. గత ఐదు సంవత్సరాలుగా సైనా ఆటతీరుని చూస్తే ఖచ్చి తంగా ఈసారి లండన్‌ ఒలింపిక్‌ మెడల్‌ని సాధి స్తుందనే అభిమానుల నమ్మకాన్ని సైనా వమ్ము చేయలేదు. ఈ ఏడాది సైనా ఓపెన్‌, థాయ్‌ లాం డ్‌ ఓపెన్‌, ఇండోనేషియా ఓపెన్‌ లాంటి పెద్ద టైటిల్స్‌ని సాధించింది. ప్రస్తుతం సైనా ప్రపంచ ర్యాంకింగ్‌లో ఐదవ స్థానంలో ఉంది.