“బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ

ఖమ్మం (జనంసాక్షి) : తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బూతు మాస్టర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, శాఖ ప్రతిష్టను భంగపరచడంపై సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో జిల్లా విద్యాధికారిణి పేర్కొన్నారు. క్రాకర్స్ వ్యాపారంలో తాను చెప్పిందే పాటించాలని సూర్దేపల్లి హైస్కూలు స్కూల్ అస్టిటెంట్ టి లక్ష్మణ్ రౌడీలా ప్రవర్తించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం జనంసాక్షి ప్రచురించిన కథనాన్ని జిల్లా విద్యాధికారులు సీరియస్ గా పరిగణించి ఆయనపై సస్పెండ్ వేటు వేశారు.