కంపెనీ లాభాల్లో వాటా కోరుతూ కార్మికుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సింగరేణి బొగ్గు గని కార్మికులకు కంపెనీల లాభాల్లో వాటా కల్పించాలని కోరుతూ బొగ్గు గని కార్మిక సంఘం నేత కింజర్ల మల్లయ్య డిమాండ్‌ చేశారు. గోదావరి ఖని సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా రాష్ట్రరోకో నిర్వహించారు. గతంలో సింగరేణి బోగ్గు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లింపు విషయం చర్చకు వచ్చిందని, అమలులో జాప్యం జరుగుతుందని దీని వల్ల కార్మికుల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాభాలతో కంపెనీ నడుస్తున్నప్పటికీ యాజమాన్యం నష్టాలు చూపుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. వెంటనేకార్మికులకు కంపెనీ లాభాల్లో వాటా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు బి.రాజలింగం, రాజమౌళి, స్వామి కార్మికులు పాల్గొన్నారు.