ముత్తారం మండల సర్పంచులను సన్మానం చేసిన మంత్రి

ముత్తారం డిసెంబర్23(జనంసాక్షి) నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అండగా ఉంటావని తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ముత్తారం కాంగ్రేస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం ఆధ్వర్యంలో మంగళవారం ముత్తారం మండలం లో కాంగ్రేస్ పార్టీ మద్దతుతో పలు గ్రామాలలో సర్పంచ్లు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులుగా గెలిచిన వారిని మంథని నియోజకవర్గ కేంద్రంలోని శివ గార్డెన్ ఫంక్షన్ హల్లో శ్రీధర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ను మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిసి సత్కారించి ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు వాజీద్ పాషా, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాధం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యార రాజయ్య తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళాలు తదితరులు పాల్గొన్నారు



