కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి)
రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజి ప్రదానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను
ఘనంగా నిర్వహించారు.రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా
నివాళులర్పించి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గారిబి హటావో అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఇప్పుడు ఉన్న ఉపాధిహామీ పథకం కూడా రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేశారని అన్నారు.పేదలకు అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో
నాయకులు చెలుకల తిరుపతి,గండి నారాయణ,
పల్లి గంగాధర్,తర్రె లింగం,సూర యాదయ్య,గుగ్గిళ్ల వెంకటేష్,అక్కినపెళ్ళి శ్రీనివాస్,గంధం మనోజ్,
ఓద్యరపు ఆనంద్,ఓద్యరపు రమేష్,తదితరులు పాల్గొన్నారు.