కెటిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

share on facebook

శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా హుజురాబాద్‌కు తెరలివెళ్లేందుకు శావిూర్‌పేట, మూడుచింతల్‌పల్లి మండలాలలో పాటు తూంకుంట మున్సిపాలిటీ, జవహర్‌నగర్‌ మున్సిలిటీలు, కార్పొరేషన్లు, మండలాల నుంచి శ్రేణులను భారీ మోహరించారు.
రాజీవ్‌ రహదారిపై కాన్వాయ్‌తో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హుజూరాబాద్‌కు వెళ్తున్న విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులతో శావిూర్‌పేటలో రాజీవ్‌ రహదారిపై ఘనంగా స్వాగతం పలికారు. శావిూర్‌పేటలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులను చూసి తానే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు మంత్రి కేటీఆర్‌. అక్కడ కాన్వాయ్‌ ఆపి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి ఆయన
సన్మానాన్ని స్వీకరించారు. అక్కడ నుంచి మంత్రి మల్లారెడ్డిని తన కారులో ఎక్కించుకుని హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశం, జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, మేకాల కావ్య, శ్యామల బుచ్చిరెడ్డి, చైర్మన్లు కారంగుల రాజేశ్వర్‌రావు, కొండల్‌రెడ్డి, పావణిజంగయ్యయాదవ్‌, చంద్రారెడ్డి, ప్రణీతశ్రీకాంత్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తాళ్ళ జగదీశ్‌గౌడ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.