క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం: హోంమంత్రి సబిత

తిరుమల: పోలీసు శాఖలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించమని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చిన మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో తితిదే ఆధికారులు ఆమెకు ప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భద్రత కోసం ఆవుటర్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.