గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కృషి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ పెద్ద చెరువులో మూడు లక్షల చేప పిల్లలను వదిలిన సందర్భంగా మాట్లాడారు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందని దీనివల్ల మత్స్యకారులు గంగ పుత్రుడు ముదిరాజులు సంఘాల ఆధ్వర్యంలో చెరువులోని చేపలను పట్టుకుని విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందు తున్నారు అన్నారు కెసిఆర్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి పని చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ రజిని మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి బాలకృష్ణ రెడ్డి రాష్ట్ర సర్పంచ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి జెడ్పిటిసి సత్యనారాయణ గౌడ్ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ మండల సర్పంచ్ల పురం అధ్యక్షులు భగవాన్ రెడ్డి మండల వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి నర్సోజి చంద్ర గౌడ్ శ్రీశైలం గౌడ్ నారాయణ గుప్తా శ్రీనివాస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు
Attachments area