గణేష్ పాడు శ్రీ విజయ దుర్గ ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం
జనం సాక్షి 26 సెప్టెంబర్: దమ్మపేట మండలంల పరిధిలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని గణేష్ పాడు శ్రీ విజయ దుర్గ ఆలయంలో ఆలయ నిర్మాణ దాతలు మందలపల్లి ఉప సర్పంచ్,దిశా కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైనవి. శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ టాటా గ్రూప్ లో పనిచేస్తున్న ఇంజనీర్ తోటకూర స్వాతి అమ్మవారికి 50 వేల రూపాయల విలువైన పట్టు చీరను జేడీ లక్ష్మీనారాయణ, కనుమూరు బాపిరాజుల చేతుల మీదుగా అందజేశారు. ఆలయ పురోహితులు సింహాద్రి నాగేశ్వరరావు, కేతిముక్కల పవన్ శర్మ, మణికంఠ, మారుతి వరప్రసాద్భ, భరత్ ల ఆధ్వర్యంలో ఆదిత్యాది నవగ్రహ హోమం, మహాగణపతి హోమం, చండీ హోమం జరుగుతాయని సూర్యనారాయణ పేర్కొన్నారు. వందల సంఖ్యలో భక్తులు భవాని మాల ధారణ చేశారు. దసరా శరన్నవరాత్రుల పర్యంతం భవాని మాలదారులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని సందర్భంగా నిర్మాణదాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిరణ్, రాజా, గోపి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.