గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ధరఖాస్తు
జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు
వనపర్తి:ఆగస్టు 27 (జనంసాక్షి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లాలో కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకునే సంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలని అందుకు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రదేశంను ఎలాంటి వివాదం లేనిదిగా స్థల యజమానితో ముందుగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.మండపాల నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటు కు https://policeportal.tspolice. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని,నిర్వాహకులు నిమజ్జనం తేదీని,నిమజ్జనానికి వెళ్లే ప్రదేశాన్ని,ఏమార్గం గుండా వెళ్ళేది తడితరవివరాలను సంబంధిత పోలీస్టేషనకు తెలియజేయాలన్నారు.సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని,ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారికి సమాచారం అందిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.వినాయకుని ప్రతిష్టచాలనుకునే వారు ఆన్లైన్ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని తెలియజేశారు.నిమజ్జనం ప్రదేశంలో ఈత వచ్చేవారు మాత్రమే ఉండాలని తద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని అన్నారు.ముఖ్యంగా యువత భక్తిభావంతో ఉత్సవాలు జరుపుకోవాలని చెడు అలవాట్లకు వెళ్లవద్దని సూచించారు.అదే విధంగా నవరాత్రి ఉత్సవాలతో పాటు నిమజ్జన ఊరేగింపు లో ఎట్టి పరిస్థితుల్లోనూ డి.జె.లను అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టు తనంమని వనపర్తి జిల్లా ప్రజల సొంతమని,రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు,యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో వనపర్తి జిల్లా ప్రజలు అందిస్తున్న సహకారంతో పోలీసు వ్యవస్థ మరింత విజయవంతముగా ముందుకు వెలుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు.