గుండెపోటుతో వ్యక్తి మృతి

జగిత్యాల (విద్యానగర్‌ ) : పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న నిర్మాణం వివాదాస్పదం కాగా ఈ సందర్బంగా జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. తన ఇంటి వద్ద స్వచ్చంద సంస్థ నిదులతో శద్దజల ప్లాంటుకోసం చేపట్టిన నిర్మాణ పనులపై మహమ్మద్‌ వసీమొద్దీన్‌ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిర్మాణ పనులు అపక పోగా ఇరువర్గాల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా వసీమొద్దీన్‌ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిర్మాణ పనులు అవక పోగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా వసీమొద్దీన్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే అస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అతను చనిపోయినట్లు వైద్యుడు ద్రువీకరించారు.