గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.. ముస్లింవాద కవి ఆక్రందన…

(శనివారం సంచిక తరువాయి…)

తీగ తెంపబడ్డ మొగ్గలు

పంచ్‌మహాల్‌ జిల్లా హాలోల్‌ తాలుకా కేంద్రంలో ఉన్న శిబిరంలో 12 మంది పిల్లలు బాగా డిస్టర్బ్‌ అయ్యి ఉన్నారు. అందులో ఒక పిల్లవాడు రాత్రిని చూడలేకపోతున్నాడు. కాలోల్‌ తాలూకాలో ఇంతియాజ్‌ అనే 5 ఏళ్ల పిల్లవాడు ప్రతిరెండు రోజులకు ూుూణ (జూశీa్‌ ్‌తీaబఎa్‌ఱష ర్‌తీవరర సఱరశీతీసవతీ) కి గురవుతున్నాడు. కనీసం 20 ఏళ్లాయిన డిస్టర్బ్‌ చేసే వ్యాధట ఇది. ఈ పిల్లవాడు తన తల్లిని నరికి తగలబెట్టడం చూశాడు. అతనికి అమీర్‌(7), మొయిన్‌(3) అనే అన్నదమ్ములు ఉన్నారు. అరాల్‌ ఊర్లో పొలాల్లో దాచుకున్న ఒక కుటుంబం – ఏడుగుర్ని నరికి తగలబెట్టారు. వాళ్లమ్మాయి హీనా (7) అదంతా చూసింది. ఇప్పుడా అమ్మాయి కింద ఏమన్నా పడ్డా బెదిరిపోతున్నది. డిరోల్‌ రైల్వే స్టేషన్‌లో దిగి వెళ్తున్న 6గురు ఆడవాళ్లని, 4గురు  మగవాళ్లని నరికి తగులబెట్టారు. వాళ్ల పిల్లలు చెట్లలో ముండ్లలో దాచుకొని చూస్తుండిపోయారు (సిరాజ్‌(5)ను అన్న ముస్తాఫా(10)నోరు మూసి దాచాడు). సంజేలిలో తల్లిదండ్రుల్ని నాయనమ్మ తాతల్ని నరికి తగలబెడితే ఆరునెలల అమ్మాయి అనాధగా మిగిలిపోయింది. సర్దార్‌పూర్‌ ఊర్లో తల్లిదండ్రుల్ని, సోదరిని తగలబెట్టేస్తే సల్మా(4), దిలావర్‌(12) అనాధలయ్యారు. వీరికన్నా చిన్నపిల్లలు మరో ఇద్దరి తల్లిదండ్రుల్ని కూడా చంపేశారు. ఇట్లా ప్రతి ఊరికి ఎందరో పిల్లలు…

ఢిల్లీ నుంచి మాలాగే వచ్చిన గౌరవ్‌ డిమ్రీ అనే యువకుడు మాతో కాలోల్‌లో మాట్లాడుతూ ‘ఎన్ని వేలమందిని చంపేశారో అన్ని వేలమంది పిల్లలైతే అనాధలై ఉంటారు కదా. అన్ని వేలమంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని చంపేయడం చూసే ఉండొచ్చు.. ఒక జనరేషన్‌ ఖరాబై పోయినట్లే! తల్లిదండ్రుల ఆక్రందనలు ఆ పసి హృదయాల్లోంచి ఎలా మాసి పోతాయి?! వాళ్లు జీవితాంతం డిస్టర్బ్‌డ్‌గానే ఉంటారు…’ అంటూ బాధపడ్డారు.మేం తిరిగిన 5 జిల్లాల్లో బాధిత ముస్లింల ఫీలింగ్స్‌…

– ‘ఈ మూడున్నర నెల్ల నుంచి మా కంటిమీద కునుకు లేదు. గుండెల్లో ఎప్పుడేమవుతుందో అన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. గోద్రా సంఘటన తర్వాత ఇండ్లు షాపులూ, అన్ని రోజులు ప్రేమించిన అన్నింటినీ అందరినీ వదిలి ఎవరి ప్రాణాలు వాళ్లం కాపాడుకుంటానికన్నట్లు పరుగులు పెట్టాం. అర్ధరాత్రిళ్లు అడవులూ, కొండలూ ఏమీ పట్టించుకోకుండా చెదిరిపోయాం. ముస్లిం జనాభా ఏ ఊర్లో ఎక్కువుందో అక్కడికి చేరడానికే అన్ని వూర్ల వాళ్లమూ ప్రయత్నించాం. ఒక ఊరి నుంచి పారిపోయిన వాళ్లు పక్క ఊర్లలోనూ నరకబడిన సంఘటనలు ఉండడంతో పక్క ఊర్లలో కూడా రక్షణ లేదని చెట్లలోంచి, పుట్టల్లోంచి పడి కొన్ని పదుల కి.మీ. ల దూరంలో ఉన్నప్పటికీ ముస్లిం జనాభా ఎక్కువున్న తాలూకా కేంద్రాల్లోకి పారిపోయి వచ్చాం…’

– ‘యే ఎకనమిక్‌ క్లాష్‌ నహీ హై’

– ‘ప్లాన్‌ హై ముసల్మానోంకా సఫాయ కర్నేకా’

– ‘రామ్‌ కే నామ్‌ ఇన్‌సానోంకో కాట్‌తే హై’

– ‘ఏక్‌ ఏక్‌ గావ్‌ ఏక్‌ ఏక్‌ జలియన్‌వాలాబాగ్‌!’ – ‘తీన్‌ మహీనో సే భూకె, ప్యాసె..’

– ‘ఆంఖో కె అంధే హై.. కానోంకె భెరే హై’

– ఖానా హరాం సోనా హరాం’ (మేము మాట్లాడిన ముస్లింల కొన్ని ఇండ్లలో క్యాలెండర్లు ఫిబ్రవరి నెలనే చూపుతున్నాయి. కాలోల్‌ తాలూకా కేంద్రంలో ఒక రాత్రి ఇంట్లో ఒక ఇంట్లో మమ్మల్ని పడుకోమన్నారు. అక్కడి గోడ గడియారం కూడా ఆగిపోయింది. క్యాలెండర్‌ ఫిబ్రవరినే చూపుతుంది.)

– ‘హమ్‌ గరీంబోకి కోన్‌ సున్నేవాలా హై’

– ముస్లింకే ఘర్‌ జలాయె గయేతో ముస్లింతో హీ ముజ్రిమ్‌ బనాయా గయా’

– ‘హమ్‌ కోయీ పరాయే నహీ హై.. హమ్‌ ఇండియా మే హీ రహనే వాలే యే హమారా భీ దేశ్‌ హై’

– ‘లూట్‌నేకే లిచూ ఐసా కహీ బీ పైసా నహీ దియా గయా!’

– సిరిఫ్‌ ముసల్మానోంకె లియే కర్ఫ్యూ థా’

– ‘యే సబ్‌ జాన్‌తే హై, ఇదర్‌ క్యా హోరా-మగర్‌ కోయీ క్యానై ఆవాజ్‌ దేతే, ఉన్‌ కో కుర్సీ చాహియే..’

– ‘గిల్‌ కో హిందూస్‌ కే సేఫ్టీ కే లియే బులాయాగయా’

– మా వాళ్ల అవశేషాలు దొరికితే లక్ష రూ.లు ఇస్తారని దొరక్కుండా తగలబెట్టారు.’

– ’13 మందిని పొలాల్లోంచి గుంజుకొచ్చి ఒక బావిలో ఎత్తేసి పై నుంచి పెద్ద రాళ్లె త్తేసి చచ్చిన శవాల్ని బతికిన వాళ్లని బైటికి లాగి అందర్ని తగలబెట్టారు.’

– ‘ఎన్ని ఏండ్ల నుంచో ప్లాన్‌ చేస్తేగాని, ఇన్నివేల మందిని చంపేపని సక్సెస్‌ కాదు’

– ‘ఈ మూడున్నర నెల్ల నుంచి ఏ రోజూ మేము మనశ్శాంతిగ లేము. ప్రతి రోజూ భయమే.. ట్రైన్‌ తగల బడిన తర్వాతి రోజుల్లో అలా… మార్చి 15 శిలాదా నం అన్చెప్పి.. తర్వాత ర్యాలి అన్చెప్పి.. రథయాత్ర అన్చె ప్పి.. ఇంకా ఎన్నో రకాల పుకార్లతో భయం భయంగా గడుపుతున్నాం..’

– ‘యహా ఔరతోం కే యోని మే లక్‌డా గుస్‌డేకే సతా సతాకే మార్‌డాలా’

– ‘జంగల్‌ మే బందర్‌ జైసా పత్తే ఖాయే’

– ‘వో లోగ్‌ పశ్తాయేంగే.. (నిర్దోశులైన మమ్మల్ని ఇట్లా చేశారు. వాళ్లు ఎప్పటికైనా పశ్చాత్తాప పడతారు అన్నీ.. ఊపర్‌వాలా దేఖ్‌లేగా అనీ అంటున్న అమాయకత్వానికి జాలి పడాలో, ద్వేషపడాలో అర్థం కాలేదు. కానీ అంతటి బీభత్సాన్ని మాత్రం ముస్లింలు, మజీదులకు వెళ్తూ దువాచేసుకుంటే ఉండడం వల్లే తట్టుకోగలమో, ఉపశమనం పొందడమో జరుగుతుందని మాత్రం అనిపించింది)’

– ‘ఇప్పటికే ముస్లిం ఏరియాలు సెపరేట్‌ అయిపోయాయి’

– ‘రాజకీయాల నుంచి మతాన్ని వేరు చెయ్యాలని కనీసం లెఫ్ట్‌ పార్టీలన్నా నినదించడం లేదు. అలా జరిగితే ఈ పరిస్థితి రాకపోయేది..’

– పెద్ద షాపులుండేవి మాకు. ఇవాళ కూలీకి పోవాల్సిన పరిస్థితి.’

– ఇంట్లో అన్ని సౌకర్యాలతో, సామాన్లతో ఉండేవాళ్లం. ఇవాళ అడుక్కు తింటున్న పరిస్థితి.

– ‘ఫిబ్రవరి 28 నుంచి నిన్న మొన్నటి వరకు మా ఇండ్లను, షాపుల్ని దోచుకుంటూనే ఉన్నారు.’

– ‘బక్రా అచ్ఛా హై, ఇసే 307 మే దాల్దో!’

– ‘బక్ర అచ్ఛా హై, ఇసే 302 మే రఖో’ – (అని ముస్లిం యువకులపై కేసులు బనాయించారు పోలీసులు)

– ‘కైసే జియేంగే, కహా జాయేంగే..’

– ‘హమే కంపెనీ సే నికాల్‌ దియా..’ (కాలోల్‌ దగ్గర్లోని జీఐడీసీ ప్లాస్టిక్‌ కంపెనీలో 20 మందిని తీసేశారు. దాడుల తర్వాత గుజరాత్‌ అంతా చాలా ప్రైవేట్‌ కంపెనీలలో ముస్లింలను ఉద్యోగాల్లోంచి తీసివేశారు)

– ‘జౌర్‌ కహీ భీ  హో ఐసా నహీ హోనా-యే హమ్‌ గరీబోంకీ దువా హై’

– ‘అసలు ఏం జరగకుండా ఉందిక్కడ? జరగకుండా ఉన్నదేదీ లేదు. మీరడగండి, ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారు. వీళ్ల మీద జరిగింది, వాళ్ల నోటితోనే ఒక్కో తీరుగా ఒక్కో కథ చెప్పారు. ఏం జరగలేదు మా మీద?’

– ‘పోలీస్‌ కుచ్‌ న కరేతో ‘ఓ లోగోంకో’ హిమ్మత్‌ ఖులేగీ…’

– ‘మేం చెబుతుంటే మీరు ఊహిస్తున్నారు. మేము అనుభవించాం. ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి’

– ‘దాడులు చేసిన వాళ్ల ముసలివాళ్లు మమ్మల్ని చూసి కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు’

– ‘మేరా దిల్‌ పూరా జల్‌ గయా భాయ్‌, కుచ్‌ నహీ హై మేరె పాస్‌, సిరిఫ్‌ అల్లా కే సివా..’

– ’40 సాల్‌ కీ కమాయీ ఏక్‌ దిన్‌ మే లూట్‌ లియే..’

– ‘హమారా జన్మ్‌ భూమీ ఎహీ హై.. క్యూ జాయే హమ్‌ పాకిస్తాన్‌?’

– కుర్సీ సంభాల్నేకే లియే ఏ నాటక్‌ చలాయే లీడర్స్‌

హమ్‌కో కట్‌ వా దియే.. ఇన్సానియత్‌ భూల్‌ గయే…’

– స్కైబాబ

(రేపటి సంచికలో… ‘గోద్రా ముస్లింల ప్రశ్నలు’)