రెండో విడతలోనూ సత్తాచాటాం

` పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం
` ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసుగెత్తారు
` రేవంత్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం
` పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుందన్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని ప్లలె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు.రేవంత్‌ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే, కాంగ్రెస్‌ కు ఉరితాళ్లుగా మారి ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే, ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకుచిత్రాన్ని ఛిద్రంచేస్తున్న రేవంత్‌ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని అన్నారు. నాడు బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్‌ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, పల్లె పల్లెనా అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతమని అన్నారు.కాంగ్రెస్‌ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిన నేపథ్యంలో ఇక సీఎం రేవంత్‌ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్‌ హెచ్చరించారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలు, అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్‌ఎస్‌ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్‌ కబందహస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసానిచ్చారు. నాడు బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్‌ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం, అధికారపార్టీపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతం అన్నారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్‌ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా పార్టీ బంగారు బాటలు వేస్తుంది’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

 

కొత్త సర్పంచ్‌లకు అండగా ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయ విభాగం
` నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కెేటీఆర్‌
రాజన్నసిరిసిల్ల(జనంసాక్షి):రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ‘మిమ్మల్ని సస్పెండ్‌ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. విూ కోసం ప్రతి జిల్లాలో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యంత్రాంగం విూకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం‘ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ్గªనాన్స్‌ కమిషన్‌ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హావిూ ఇచ్చారు. కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హావిూలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్‌ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్‌ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్‌ని కాపాడలేకపోయారని కేటీఆర్‌ అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా భయపడకుండా ప్రజలు మా పార్టీ నేతలు నిలబడ్డారని.. అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీని గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తికి వ్యతిరేకతకు పంచాయతీరాజ్‌ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు.సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్‌ సూచించారు. సూర్యాపేట జిల్లాలోని ’ఏపూర్‌’ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటూ.. అక్కడ చెక్‌ డ్యాంలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిందని గుర్తుచేశారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని హితవు పలికారు. ప్లలె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్‌ యార్డ్‌, ట్రాక్టర్‌, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్‌ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని కేటీఆర్‌ వెల్లడిరచారు. మిగిలిన విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకుందని, ఇది కేసీఆర్‌ పాలన దక్షతకు నిదర్శనమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదని అన్నారు. ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేశామని ప్రతి గ్రామానికి పరిశుద్ధ నిర్వహణ నుంచి మొదలుకొని పచ్చదనం వరకు తాగునీటి సరఫరా వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే తెలంగాణ పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు కేంద్రం నుంచి అనేక అంశాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఉత్తమ జిల్లా పరిషత్తులు అవార్డులను దక్కించుకున్నాయని అన్నారు.