పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
ముత్తారం డిసెంబర్ 16(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వారం కూడా గడువకముందే గ్రామంలోని సమస్యలను గుర్తించి సర్పంచ్ భర్త పారిశుధ్య కార్మికుడిగా మారారు. సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు అనేక విధాలుగా పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికి గ్రామంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు భార్య గ్రామభివృద్ధికి తొడ్పాడాలని ఉద్దెశంతో నిలిచిపోయిన పనులను ప్రారంభించాడు. పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపేట గ్రామంలో మురుగు కాల్వను నిండుకొని దుర్గంధం వెదజల్లుతుండడంతో సర్పంచ్ కృష్ణవేణి భర్త సదితో సర్చించడంతో మంగళవారం పంచాయతీ కార్మికుడిగా మారి కాల్వను శుభ్రం చేయడంతో నూతన సర్పంచ్ దంపతులును చొరవను గ్రామస్తులు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.



