కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత

తుంగతుర్తి డిసెంబర్ 16 (జనం సాక్షి)
తుంగతుర్తి ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు దిగ్గజం మూర గుండ్ల లక్ష్మయ్య అనారోగ్యంతో కన్నుమూశారు మద్దిరాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందినవారు, ఇటీవల వయోభారంతో అనారోగ్యానికి గురై హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈయన తుంగతుర్తి నియోజకవర్గంలో సుదీర్ఘకాలం సిపిఎం పార్టీలో పని చేస్తూ నియోజకవర్గానికి డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు, ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, శిష్యుడుగా ఉంటూ మల్లు స్వరాజ్యం అడుగుజాడల్లో నడుస్తూ అహర్నిశలు సిపిఎం పార్టీ అభివృద్ధికి గ్రామ గ్రామాన కృషి చేశాడు, తుంగతుర్తి జడ్పిటిసిగా, మామిళ్ల మడవ, కొత్త పెళ్లి ఎంపీటీసీగా, ముకుందాపురం సర్పంచ్ గా, నూతనకల్ వైస్ ఎంపీపీ గా పని చేశారు, 2007 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీతోపొత్తులో భాగంగా తుంగతుర్తి జడ్పిటిసి గా ఎన్నికయ్యారు, అనంతరం అన్ని మండలాల్లో సిపిఎం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాప్రతినిధులను గెలిపించేందుకు తన వంతు కృషి చేశాడు, 2018లో కొన్ని కారణాలవల్ల ఆయన సిపిఎం పార్టీ నుండి బయటకు వచ్చి సిపిఐ పార్టీలో చేరారు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు ఎర్రజెండా నీడలో పనిచేశారు, నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ భూస్వాముల కబంధహస్తాల్లో ఉన్న భూములను విడిపించి పేద రైతుల పట్టాల కోసం నిరంతరం పోరాటాలు చేశారు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు, ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా సమితి గౌరవ అధ్యక్షులు కొప్పోజు సూర్యనారాయణ. వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లు ప్రసాద్, దొడ్డ వెంకటయ్య, కంబాల శ్రీనివాస్, మామిడి నరసయ్య, జక్కుల రమేష్, శ్రీకాంత్, పాపిరెడ్డి, తుంగతుర్తి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చూశారు


