నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లు 18 మంది ఏకగ్రీవం
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 16 (జనం సాక్షి): మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో 18 గ్రామపంచాయతీలలో ఉప సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో అంతమ్మగూడెం బండ మురహరి, భీమనపల్లి గంగాదేవి గురవయ్య, దంతూర్ బింగి పూజ , దేశ్ ముఖి నూకల అశోక్, ధర్మారెడ్డి పల్లి కొమిరె కిరణ్ కుమార్ , దోతిగూడెం బద్దం వెంకట్ రెడ్డి , గౌస్ కోండ వాకిటి బాల్ రెడ్డి ,జగత్ పల్లి బొబ్బల జైపాల్ రెడ్డి ,జలాల్పూర్ కేసరం మధుసూదన్ రెడ్డి ,జూలూరు దాసరి నర్సింహా , కనుముక్కుల పడమటి మహిపాల్ రెడ్డి , కప్రాయిపల్లి మార్గం వెంకటేష్, పెద్దగూడెం శేఖర్ రెడ్డి , పెద్దరావుల పల్లి వరకాల భానుచందర్, పిలాయిపల్లి బందారపు లక్ష్మయ్య, రామలింగం పల్లి రామావత్ రాజు నాయక్ , శివారెడ్డి గూడెం చిలుకుల సంతోష్, వంకమామిడి బొమ్మగోని పరమేష్ ఎన్నికయ్యారు. మిగిలిన గ్రామపంచాయతీలలో ఉప సర్పంచ్‌ల ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తికానుంది. నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.


