ఉత్తరాది గజగజ
` పెరిగిన చలి..ఢల్లీిలో తీవ్ర పొగమంచు
` ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం
` పలు విమాన సర్వీసుల్లో అంతరాయం..
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తర భారతదేశాన్ని చలి గడ గడలాడిస్తుంది. రాజధాని ఢల్లీిని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢల్లీి సహా పంజాబ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో విపరీతమైన పొంగ మంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉదయం పూట హైవే పై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని. దీంతో వాహనదారులు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. ఢల్లీి`ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచి విపరీతంగా కమ్మేసింది. దీంతో విమాన, రైలు రాకపోకలపై ప్రభావం పడిరది. ఈ నేపథ్యంలోనే ఢల్లీి ఎయిర్‌పోర్ట్ ఒకేసారి 100 కు పైగా విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు 300 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొగమంచు కారణంగా సుమారు వంద రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢల్లీిలో పొగమంచు పరిస్థిసి నేపథ్యంలో ఢల్లీి ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు కీలక సూచన జారీ చేసింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల స్టేటస్ చెక్ చేసుకోవాలని తెలిపింది. ఎయిర్‌లైన్ సిబ్బంది వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ఢల్లీి విమానాశ్రయ ఆధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ కు అనుగుణంగా పనిచేస్తన్నాయని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. మరోవైపు ఇండిగో, ఎయిర్ ఇండియా వాతావరణ పరిస్థితిలు దృష్ట్యా పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. విమానాల స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే వెబ్ సైట్స్ కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
దిల్లీలో తీవ్ర పొగమంచు: ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం
దిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం నెలకొంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ బయల్దేరాల్సి ఉంది. అయితే దిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రధాని విమానం ఆలస్యమయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిరచాయి.
పలు విమాన సర్వీసుల్లో అంతరాయం..
మరోవైపు పొగమంచు కారణంగా దిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే పలు విమాన సర్వీసుల్లో ఆలస్యం నెలకొన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండిగో, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గడం వల్ల పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయని తెలిపాయి. విమానాల స్టేటస్ గురించి తెలుసుకోవడం కోసం తమ వెబ్‌సైట్లను పరిశీలిస్తూ ఉండాలని ప్రయాణికులకు సూచించాయి. ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలిపాయి. ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నాయి. ఇదీ చదవండి: ప్రాణాలను పణంగా పెట్టి.. ఉగ్రవాదులకు ఎదురొడ్డి.. ‘రియల్ హీరో’ అహ్మద్


