గొప్పగా ఎదగాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి

   – హుజూర్ నగర్ జాబ్ మేళాలో ఎమ్మెల్యే                    – మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
– జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత                                                                    – ఉద్యోగాలు పొందిన 170 మంది అభ్యర్థులు              – ఎమ్మెల్యే సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగ యువత                                         -ఎమ్మెల్యే సైదిరెడ్డి  హుజూర్ నగర్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి): గొప్పగా ఎదగాలి అంటే  కొన్ని త్యాగాలు చేయాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ టౌన్ హాల్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హాజరై జాబ్ మేళాని ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు స్పందించిన రైస్ సీఈవో కన్నన్ కి,  టాస్క్ సంస్థ ప్రదీప్ కి ధన్యవాదాలు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో హాజరైన 17 మెగా కంపెనీల హెచ్ ఆర్ డైరెక్టర్ లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన అనేక మంది అభ్యర్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అభ్యర్థుల జీవితం గురించి, లైఫ్ స్కిల్స్, అవకాశాల గురించి, విదేశాలలో వుండే ఈ తరం యువత ఆలోచన విధానాల గురించి చాలా క్షుణ్ణంగా వివారించారు. యువత ఇంటి నుండి బైటికి రావాలి. కాన్ఫర్ట్ జోన్ నుండి బైటికి రావాలి. బైట ఉన్న ప్రపంచంతో పోటీ పడాలి, అప్పుడే జీవితం గొప్పగా ఉంటుంది అని సూచించారు. విదేశాలలో 18 ఏళ్ళు దాటితే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా జీవిస్తారని, అలాంటి ఆలోచన విధానం మనం కూడా అలవర్చుకోవాలి అని తెలియజేజేశారు. ఒక చిన్న అవకాశం ద్వారా జాబ్ లోకి ప్రవేశించి అదే కంపెనీలో టాలెంట్ చూపించి మేనేజర్ స్థాయికి ఎదగవచ్చు అని తెలియజేసారు. గ్రామాలలో ఏ పని లేకుండా ఖాళీగా ఉంటె చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంటుంది అని, అంతే కాకుండా ఏ పని చేయకుంటే సోమరులు అవుతారని, తల్లిదండ్రులకు భారంగా ఉంటారని సూచించారు. మెగా జాబ్ మేళాలో 800 మంది అభ్యర్థులు హాజరు కాగా ఇప్పటివరకు 170 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలలో ఆయా ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఆయా కంపెనీలు వెంటనే ఆఫర్ లెటర్స్ ఇవ్వగా, ఆ ఆఫర్ లెటర్స్ ను హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చేతులమీదుగా అభ్యర్థులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాట్లాడుతూ మెగా జాబ్ మేళాను నిర్వహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మా కోసం జాబ్ మేళా నిర్వహించి మా వద్దకే పెద్ద పెద్ద కంపెనీ హెచ్ఆర్లను రప్పించి ఇక్కడే సెలక్షన్లు నిర్వహించి వెనువెంటనే అపార్ట్మెంట్ ఆర్డర్లను కూడా ఇప్పించిన ఎమ్మెల్యేకి మేము, మా కుటుంబాలు రుణపడి ఉంటామని తెలియజేశారు. అనంతరం రైస్ సంస్థ సీఈవో కన్నన్ కి, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ కి, వివిధ కంపెనీల హెచ్ఆర్లకు ఎమ్మెల్యే సైదిరెడ్డి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎంపిక కాబడిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నేరేడుచర్ల వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, చీకూరి లీలావతి, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.