గొల్లపల్లి పంచాయతీకి రాష్ట్రస్థాయి అవార్డు.
ఫొటో : అవార్డు అందుకుంటున్న సర్పంచ్ ఇందూరి శశికళ.నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీకి రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉందని సర్పంచ్ తెలిపారు. పంచాయతీకి అవార్డు రావడానికి కృషి చేసిన పాలక వర్గానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.