గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యం


సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
కామారెడ్డి,ఆగస్టు17 (జనంసాక్షి): గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం టాక్లి గ్రామంలో మంగళవారం వివిధ అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన టాక్లి గ్రామం నుంచి సాలంపాడు గ్రామానికి వెళ్లే పొలం దారిని స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పరిశీలించారు. రైతులకు
సౌకర్యంగా ఉండడానికి, ధాన్యం తరలించడానికి ఇబ్బందులు లేకుండా నూతనంగా రోడ్డు నిర్మించడానికి కోటి రూపాయలను స్పెషల్‌ డవలప్‌ మెంట్‌ ఫండ్‌ ద్వారా మంజూరు చేసినట్లు తెలిపారు. టాక్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 20 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించి నూతనంగా నిర్మించనున్న మరో 10 ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం సోంపూరు గ్రామంలో పర్యటించిన సభాపతి రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, డ్వాక్రా మహిళా సంఘం ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న 30 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు, అంగనవాడి భవనం, ఎస్సీ కమ్యునిటీ హాల్‌లకు స్పీకర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్‌ మాట్లాడుతూ.. గ్రామంలో స్వంతం ఇళ్లు లేని, పాత ఇళ్లలో నివసిస్తున్న పేదలకు అందరికీ స్వంత ఇంటిని మంజూరు చేస్తామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి గతంలో అయిదువేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తి అయ్యామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో అయిదువేల ఇళష్ట్రశను ప్రత్యేకంగా మంజూరు చేశారని చెప్పారు. రైతుల కోరినట్లు టాక్లి నుంచి సాలంపాడు వెళ్లే పొలాల దారిని నిర్మించడానికి స్పెషల్‌ డెవలప్‌ మెంట్‌ ఫండ్స్‌ ద్వారా కోటి రూపాయలను కెటాయించామని, ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామంలోని మెజారిటీ రైతులకు ఎంతో సౌకర్యం కలుగుతుందన్నారు. రైతుల సంక్షేమం, అభివద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబరధు, రైతు బీమాను అమలు చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా, పండిన పంటను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆడబిడ్డకు ఇబ్బందులు లేకుండా మిషన్‌ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేస్తున్నారన్నారు. వద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని, తెలంగాణ వస్తే ఏమోస్తది అనే వారికి ఈ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలే సమాధానమన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.