ఘనంగా ఎంగిలి పువ్వు బతకమ్మ వేడుకలు
మండల కేంద్రంలో బతకమ్మ ఆడుతున్న మహిళలు
పెన్ పహాడ్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలి పువ్వు బతకమ్మను మహిళలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు ఎంతో ప్రతికరమైన బతకమ్మలను తయారుచేయడం కోసం మహిళలు ఉదయం నుండి రంగురంగుల పూలను సేకరించి అందంగా బతకమ్మలను పేర్చి,పేర్చిన బతకమ్మలను బజాబజంత్రీల నడుమ ఉరేగింపుగా తీసుకెళ్లి చెరువు కట్టల వద్ద పురోహితులు చేత గౌరీ పూజలు నిర్వహించి బతకమ్మ పాటలతో ఆడిపాడీ అనంతరం చెరువుల వద్ద ఏర్పాటు చేసిన బతకమ్మ గాట్ల ద్వారా చెరువుల్లోని నీటిలో బతకమ్మలను విడిచి పెట్టారు మొదటి రోజు బతకమ్మ పండుగ వేడుకలు చూపరులను అలరించాయి ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూముల శ్వేతా సురేష్ రావు, మహిళలు రంగినేని వనమ్మ,నిర్మల,మాధవి,రంగినేని వసుమతి, విమలమ్మ,వసుమతి, యామిని, స్వాతి,మంజుల,భవాని, శ్రీదేవి,స్రవంతి మహిళలు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail